25-07-2025 02:29:33 PM
హైదరాబాద్: అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఆత్మగౌరవ గర్జన సభకు కేటీఆర్ హాజరయ్యారు. లింగంపేట్ ఆత్మగౌరవ గర్జన సభకు బయల్దేరిన కేటీఆర్‌కు కామారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కరోనా వచ్చినా రాష్ట్రంలో ఏ పథకాలు ఆపలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని చెప్పారు. అంబేడ్కర్ జయంతి రోజున దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలును పోలీసులు అవమానించిన నైపథ్యంలో కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆత్మగౌరవ గర్జన కార్యక్రమానికి ఏర్పాటు చేసి అతన్ని సత్కరించారు.