calender_icon.png 7 December, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

07-12-2025 12:00:00 AM

జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీ సర్వేందర్

ముషీరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో ఉందని, ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి జనతా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని జనతా కాంగ్రెస్ నేషనల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బి. సర్వేందర్, ప్రధాన కార్యదర్శి ఎన్. అశోక్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెం ట్ ఏబెల్, ప్రధాన కార్యదర్శి ఎన్. అశోక్ కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రస్తుత పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసాయని, ప్రభుత్వాలు ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయి తప్ప హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయని వారన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలోని అనేక రాష్ట్రాలలో జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమా నికి కృషి చేస్తుందన్నారు.

తెలంగాణలో పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టినట్లు వారు వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 11న సికింద్రా బాద్ బోయిన్‌పల్లిలో రాష్ట్ర కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మెతాబ్ రాయ్ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యంగా యువతను రాజకీయా ల్లోకి తీసుకురావడమే తమ పార్టీ లక్ష్యమన్నారు.

తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి ప్రభు త్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. పార్టీ అభివృద్ధితో పాటు దేశాభివృ ద్ధి, అందరికీ సమాన అవకాశాలు తమ పార్టీ కల్పిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ శర్మ, రాష్ట్ర కన్వీనర్ రవీందర్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి షేక్ మన్సూర్ షా, శ్రీనివాస్, హైదరాబాద్ అధ్యక్షుడు తన్వీర్ పాల్గొన్నారు.