calender_icon.png 7 December, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకదానికొకటి ఢీకొన్న బస్సులు, ఆటో ట్రాలీ..

06-12-2025 11:19:41 PM

ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం మావల సమీపంలోని దేవాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై నిర్మల్ వైపు వెళ్తున్న మహారాష్ట్ర బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుకనున్న ఆటో ట్రాలీ, ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగిలి ముందర భాగం స్వల్పంగా ధ్వంసం అయింది. కాగా బస్సులోని  ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.