హరిత గ్రహాన్ని నిర్మిద్దాం
నేడు భూమి వేడెక్కి పోతుంది. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్ ప్రమాద సూచికలు దాటింది. భూగోళం 74 శాతం విధ్వంసం అయింది. దీనిని అభివృద్ధి అని చెబుతున్నారు. అభివృద్ధి జరగాలంటే ప్రకృతి సంపూర్ణ ఆరోగ్యంతోటి ఉండాలి. భూమి, ఆకాశం, జలం, వాయువు, అగ్ని వాటి స్థానంలో ఉండాలి. అభివృద్ధి, ఆధునిక శాస్త్ర విజ్ఞానం పేరుతోని చేస్తున్న కృత్రిమ పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఉదాహరణకు బోపాల్ దుర్ఘటన. ఈ పరిశ్రమల వల్ల వస్తున్న కాలుష్యంతో ఆక్సిజన్ పర్సంటేజీ ప్రమాదం అంచుకొచ్చింది. ఈ నమూనా అభివృద్ధి ఎవరికోసం. ఈ రోజు భూగ్రహం మొత్తం విషవాయులతో, విష వైరస్‌లతో నిండిపోయింది. మనిషి కృత్రిమమైన సుఖాలకు అలవాటు పడి దురాశతోని ఈ ప్రకృతిని విషతుల్యం చేశాడు. ఇప్పుడు 840 కోట్ల మంది మానవులు ఈ భూగోళంపైన జీవిస్తున్నరు. వీరితో పాటు 80,000 వేల కోట్లు మిగతా ప్రాణికోటి జీవిస్తుంది. ఇందులో శాస్త్రీయంగా ఈ ప్రకృతిలో మానవుల వాటా ఎంత? మిగతా ప్రాణి కోటి వాటా ఎంత?
ఈనాడు మానవుడు చేసిన అజ్ఞానపు పనులకు, దురాశకు 840 కోట్ల మంది 78 శాతం అనారోగ్యకరమైన జీవితాలు గడువుతున్నారు. దీనికి ఆధునిక విజ్ఞానం, అభివృద్ధి అని అసహజ ఆనందాలతోని నిండిన మానసిక రోగులుగా ఈ భూగోళం మీద చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఏ భూగోళం మనకు నివాసం ఇచ్చిందో ఇక్కడ మనం టెనెంట్లం మాత్రమే, ఓనర్లం కాదు. అలాంటప్పుడు నీ అజ్ఞానంతో అస్థిర విజ్ఞానంతో ఒక్క వాటాదారునివైన నీవు 99 శాతం వాటాదారుల హక్కులని హరించే అధికారం ఎవడిచ్చాడు? ఈ విపత్కర పరిస్థితుల వల్ల ఐక్యరాజ్యసమితి ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగి ఏదీ సుస్థిరాభివృద్ధి, ఏదీ అస్థిర అభివృద్ధి అనే ప్రశ్నకు 17వ శతాబ్దం నుంచి ప్రారంభమైన కాలుష్యం ఈ రోజుకు వెయ్యి పడగలతో విషం చిమ్ముతున్నది. ప్రకృతిలో ప్రాణికోటి కనుమరుగైన తరువాత ఈ అభివృద్ధి ఎవరికోసం? ప్రపంచంలో 206 దేశాలు సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయి.. అయినా భారతదేశంలో ఒక్క అడుగు కూడా ప్రకృతికి పునర్జీవనం చేసే ప్రయత్నం జరుగుతలేదు. మహాత్మాగాంధీ 1930లో ప్రకృతి నీ అవసరాలు తీరుస్తుంది, నీ దురాశను తీర్చలేదని చెప్పారు.






