2 July, 2026 | 4:18 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

13-05-2026 12:59 AM

చిట్యాల, మే 12 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థి, విద్యార్థినీలకు విద్యాభ్యాసంలో ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చిట్యాల ఆధ్వర్యంలో మంగళవారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆప్ చిట్యాల అధ్యక్షుడు రవీందర్ గౌడ్ జనగాం పంపిణీని ప్రారంభించి మాట్లాడారు.

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా విద్యార్థుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు మాధవరెడ్డి పాటి, ప్రధాన కార్యదర్శి నరసింహ రేగులగడ్డ, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు రంగా, సతీష్ కంబంపాటి, మహేందర్ రెడ్డి నల్ల, ఎల్లయ్య కోనేటి పాల్గొన్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.