27 April, 2026 | 2:46 AM

మహనీయుల జాతరను విజయవంతం చేద్దాం

27-04-2026 01:06 AM

పిలుపునిచ్చిన బీజేపీ నేత చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

చేవెళ్ల ఏప్రిల్ 26(విజయక్రాంతి): మహనీయుల జాతరను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పిలుపునిచ్చారు. ఈనెల 30న నిర్వహించనున్న మహనీయుల జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆదివారం చేవెళ్లలో ఆవిష్కరించి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహనీయులు సామాజిక న్యాయం, సమానత్వం, అంటరానితనం నిర్మూలన, అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేశారని, వారి ఆశయాలను  సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 

ఈ కార్యక్రమంలో మహనీయుల జాతర కమిటీ చైర్మన్ బురాన్ ప్రభాకర్, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు అత్తెల్లి అనంత్ రెడ్డి, జిల్లా యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి, మహనీయుల కమిటీ వైస్ చైర్మన్ మాచన్ పల్లి రామస్వామి, కోశాధికారి ఏర్పుల మల్లేష్,  చేవెళ్ల కమిటీ సభ్యులు బ్యాగరి ప్రభాకర్, మల్లెపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.