నీట మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
- ఆడుకుంటూ వెళ్లి కుంటలో పడిన పిల్లలు
- లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో తీవ్ర విషాదం
- నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో ఘటన
కామారెడ్డి, జూన్ 5(విజయక్రాంతి): ఆడుకుంటూ వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీలో నివాసం ఉంటున్న అరవింద్ (4), వర్షిని (5), హరీష్ (10) శుక్రవారం సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్దకు ఆడుకుంటూ వెళ్లి స్నానం కోసం కుంటలోకి దిగారు.
ఈత రాకపోవడంతో ముగ్గురు పిల్లలు నీట మునిగి మృతి చెందారు. స్థానికులు గమనించి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచార మందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లి కుంటలోకి వెళ్లి ముగ్గురి పిల్లల శవాలను బయటకు తీశారు. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు మృతి చెందడం వడ్డెర కాలనీవాసులను తీవ్రంగా కలిసి వేసింది. ఎంతో అల్లరి ముద్దుగా ఉన్న పిల్లలు ముగ్గురు మృతి చెందడం స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. తల్లిదండ్రుల రోదనాలను చూసి స్థానికులు బోరున విల పించారు. నిజా మాబాద్ జిల్లాలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.






