కేంద్ర ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటు
24-07-2026 01:37 AM
బైంసా జూలై 23 (విజయక్రాంతి): నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఖరి సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం ఇన్చార్జి బి నారాయణరావు పటేల్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి విమర్శించారు.
ప్రశ్నాపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బైంసాలో ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంఘటనపై నిర్లక్ష్యం వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. సంఘటన జరిగి నెలలు గడుస్తున్న ప్రభుత్వం అసమర్థత చర్యలు దురదృష్టకరమన్నారు. ఈ విషయమై ఆందోళన చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, నేతలు ప్రియాంక గాంధీ ఇతర నేతలను అరెస్టు చేయడం ప్రజాస్వామికమని అన్నారు.






