ప్లాస్టిక్ రహిత పట్టణానికి కృషి చేద్దాం
మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి
జనగామ, జూన్ 21 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జనగామ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుకుందామని మున్సిపల్ కమిషనర్ సి.హెచ్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పట్టణ సుందరీ కరణ ప్రజా ఆరోగ్యాలను కాపాడేందుకు జనగామ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని జనగామ పట్టణం నుండి తరిమేసేందుకు ప్రతి పౌరుడి బాధ్యత వహించాలని, అదేవిధంగా అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు సహకరించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ప్లాస్టిక్ హోల్ సేల్ షాప్, లో యజమానులకు సూచించారు. ప్లాస్టిక్ విక్రయిస్తే 5000 నుండి 25 వేల వరకు జరిమానా విధించి, 2019 మున్సిపల్ ఆక్ట్ ప్రకారం షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని, అదేవిధంగా చట్టవరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






