7 August, 2026 | 1:06 AM

భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాం

07-08-2026 12:19 AM

సేంద్రీయ సాగు.. రైతులకు మేలు 

కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి

నిర్మల్, ఆగస్టు 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం భూభారతి సంస్కరణలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, కమిషన్ సభ్యులతో కలిసి సమీక్ష చేశారు సేంద్రీయ వ్యవ సాయం, మార్కెటింగ్, ఉద్యానవన పంటల సాగు, ప్రభుత్వ ప్రోత్సాహం, రైతుల సంక్షేమం తదితర అంశ. అంశాలపై మాట్లాడారు.

రైతులు సేంద్రీయ సాగుపై దృష్టి పెట్టాలని, సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి పంట మార్పిడి విధానాలను విధిగా పాటించాలని పిలుపునిచ్చారు. సేంద్రీయ పంటల ఉత్పత్తు ల నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రభుత్వం ప్ర త్యేక విధివిధానాలను రూపొందిస్తోందని వె ల్లడించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రీయ ఉత్పత్తులకు అద్భుతమైన డిమాండ్ ఉంద ని, రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు అ న్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు అ త్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

కమిషన్ సభ్యులు రైతుల సమస్యలపై నివృత్తి చేశారు

 జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.. జిల్లాలో పంట మార్పిడి విధానా లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని దాదాపు 2 లక్షల మంది రైతులు వరి, మొక్కజొన్న, జొన్న, సోయా, కందులు వంటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, పూల సాగు వంటి ఉద్యానవన రంగం వైపు రైతులను మళ్లిస్తున్నట్లు చెప్పారు. శ్రీరాంసాగర్, కడెం, గడ్డెన్నవాగు, స్వర్ణ ప్రాజెక్టుల కింద జిల్లాలో సాగు విస్తీర్ణం విస్తారంగా ఉందని తెలిపారు. 

కమిషన్ సభ్యులు రాములు నాయక్, కె.వి.ఎన్. రెడ్డి, భవానీ రెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, సునీల్ కుమార్, గంగాధర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డి.ఎఫ్.ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.