14 July, 2026 | 3:25 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

అంబేద్కర్ ఆలోచనా విధానం కొనసాగిద్దాం

24-06-2024 03:18 AM
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హనుమకొండ (బీమదేవరపల్లి), జూన్ 23: అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, యువత ఆయన ఆలోచన విధానాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పిలుపునిచ్చారు. ఆదివారం బీమదేవరపల్లి మండలం గాంధీనగర్‌లో భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లా డారు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన పిల్లల భవిష్యత్ నిర్మాణాత్మకంగా ఉంటుందన్నారు. రాజ్యంగం ఎప్పటికీ ఓడిపోదని శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు.

మతం పేరుతో రాజ్యాంగంపై చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభు త్వం విద్యా వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యత కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రాష్ట్రంలో ఉన్న 25 వేల పాఠశాలలకు రూ.11 వందల కోట్లతో మౌళిక వసతుల కోసం ఖర్చు చేశామన్నారు. మెగా డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. కార్యక్రమంలో గాయకుడు ఏపూరి సోమన్న, రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.