calender_icon.png 20 August, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దాం

19-08-2025 12:00:00 AM

వినాయకుడి ప్రతిమ తయారు చేయడం నుంచి పూజించడం, నిమజ్జనం చేయడం దాకా అంతా ప్రకృతి కేంద్రంగా జరుగుతుంది. సంప్రదాయ పూజ పద్ధతిలో ‘రీసైకిల్’ అనే ఒక పర్యావరణ నియమం మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ, ప్రస్తుతం సమాజంలో వినాయక చవితి పండుగ జరుపుకొనే వి ధానం పర్యావరణ విధ్వంసం కలిగించే విధంగా ఉంటుంది. మ ట్టితో తయారుచేసిన ప్రతిమలకు బదులుగా ‘ప్లాస్టర్ ఆఫ్ పారిస్’ అనే విష రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించ డం ఆనవాయితీగా మారిపోయింది.

ఈ పద్ధతిని విడనాడి రా బోయే వినాయక చవితికి మట్టి విగ్రహాలనే ప్రోత్సహిద్దాం. ప్ర తిఏటా రాజకీయ నాయకులు మట్టి విగ్రహాలనే పెట్టాలని పలికే మాటలు కేవలం ప్రచారానికే తప్ప ఆచరలో అది ఎంత మాత్రం సాధ్యం కావడం లేదు. ఈసారైనా అధిక సంఖ్యలో మట్టి వి గ్రహాలను ఏర్పాటు చేసి గణనాథుడికి పూజలు చేయాలి. అందుకే నీటిలో కరిగే  మట్టి విగ్రహాలనే పూజిస్తూ ముందుకు సాగుదాం.

 లక్ష్మీనారాయణ, కరీంనగర్