18-04-2025 01:28:37 AM
మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో 5వ డివిజన్ దాసరి వాడలోకార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.మొదట పార్టీ జెండాను ఎగరవేశారు.అనంతరం డివిజన్ అధ్యక్షులు బొల్లిపెల్లి పున్నంచందర్ ఆధ్వర్యంలో మహాసభ గురించి ర్యాలీగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన పార్టీ నాటి టీఆర్‌ఎస్ నేటి బీఆర్‌ఎస్ పార్టీ, పోరాడినవారు గులాబీ సైనికులని అన్నారు.తెలంగాణ కోసం పదవీ త్యాగాలు, కేసులు, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నామని తెలిపారు. అనేక నిర్బంధాలను సైతం ఎదుర్కొన్నామని వివరించారు.
14 ఏండ్ల పాటు తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. సాధించిన తెలంగాణను 10 ఏండ్ల బీఆర్‌ఎస్, కేసీఆర్ పాలనలో దేశంలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనత కేసీఆర్ కె దక్కుతుందని వివరించారు. ఈ నెల 27న ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగ సందర్భంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నందున ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు పండుగ సాగర్, నాయకులు రమేష్, రాజు, రమేష్ నాయక్, రాము, ప్రభాకర్, క్రిష్ణ, భార్గవ్, సమ్మయ్య, సోమేశ్వర్, అరవింద్, లత, రవళి, మౌనిక, శ్రీలత, రమ, సాయి, సతీష్ రెడ్డి, విశాల్, రవి, వికాస్, వినయ్, కిరణ్, ప్రణయ్, వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.