25-08-2025 01:38:12 AM
కరీంనగర్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ఆదివారం పరామర్శించారు. ఐదు రోజుల కిందట ఎమ్మెల్యే రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోని వాల్మీకి నగర్ లో గల కవ్వంపల్లి నివాసానికి వారి చేరుకొని రాజేశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించనున్న జనహిత కార్యక్రమంలో పాల్గొ నేందుకు విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, రాష్ట్ర రవాణా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, మెన్నేని రోహిత్ రావు తోపాటు పలువురు నాయకులు ఎమ్మెల్యే సత్యనారాయణను పరామర్శించారు.
అంతకుముందు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , సుడా చైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్షుడు కొండూరి రవీందర్ రావు, తదితరులుపరామర్శించారు.