12-10-2025 04:10:10 AM
హనుమకొండ, అక్టోబర్ 11 (విజయక్రాం తి): కృష్ణా నదీ జలాలను వదులుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి చనిపోగా.. శనివారం ఆయనను హనుమకొండలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మంత్రి సీతక్కతో కలిసి మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిలో నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సిన నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునేది లేదని స్పష్టం చేశారు.
ఈ విషయమై కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌లో తమ వాదనలు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. కృష్ణాలో 512 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ ఒప్పుకుందని ఆయన ఆరోపించారు. కాగా, కాళే శ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా తెలంగాణలో అత్యధిక వరి పంట పండిందన్నారు. గోదావరి, కృష్ణా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడం సరికాదని, ఆయన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఏపీ సర్కారు చేపట్టే బనకచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని, ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కేంద్రానికి ఇదే విషయం పదే పదే చెప్తామన్నారు. మంత్రి హోదాలో కృష్ణా ట్రిబ్యునల్‌కి హాజరైన ఏకైక మంత్రి తానే అని ఉత్తమ్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు.
చేవెళ-ప్రాణహిత పనులు పునరుద్ధరిస్తాం
తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్రనీటి పారుదల శాఖ -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాం తి): చేవెళ్ల--ప్రాణహిత ప్రాజెక్టు పనులను పునరిద్దరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇకపై నీటపారుదల శాఖ ఆధ్వర్యంలోని ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్‌ను అందిస్తామన్నారు. అందుకు అనుగుణంగా నీటిపారుదల శాఖ భూముల్లో సోలా ర్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శనివారం సచివాలయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహిం చారు.
నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్య నాథ్ దాస్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు సమావేశంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పాత ప్రతిపాదన ప్రకారం తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి ద్వారా చేవెళ్లకు నీరు అందించే యోచన చేస్తున్నామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి 71 కిలోమీటర్ల మేర దూరం ఉన్న కాల్వపనుల్లో ఇప్పటికే 45 కిలోమీటర్ల దూరం పూర్తి అయ్యాయన్నారు. 71 కిలోమీటర్ పాయింట్ నుంచి అంటే మంచిర్యాల జిల్లా మైలారం గ్రామ సమీపం నుంచి నీటిని తరలించ డానికి రెండు మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు.
అందులో మొదటిది పాత ప్రణాళిక ప్రకారం మైలారం నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఒక లిఫ్ట్ అవసరం ఉంటుందని గుర్తించామన్నారు. రెండోది అదే పాయింట్ నుంచి సుందిళ్ల బ్యారేజ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల దూరం వరద కాలువ ద్వారా నీటిని తరలించే అవకాశం ఉందన్నారు. రెం డు మార్గాలు కుడా ఆర్థికంగా భారం కాకుం డా తక్కువ ఖర్చుతో అయ్యేలా అధికారులు ప్రతిపాదించారంన్నారు.
రెండు మార్గాల కు సంబంధించి సవరించిన డీపీఆర్‌లను అక్టోబర్ నెలాఖరు వరకు సిద్ధం చేయాలన్నారు. నీటిపారుదల శాఖకు చెందిన భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఇక పై విద్యుత్‌తో నడిచే నీటిపారుదల శాఖ ప్రాజెక్టులకు సోలార్ విద్యుత్‌ను వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరు ద్ధరణకు ఏరియల్ సర్వే పనులను వేగ వంతం చేయాలన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం, బనకచర్ల ప్రాజెక్టు అంశాలపై కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని తెలిపారు.