అవినీతిని అంతమొందిద్దాం!
ఐ.ప్రసాదరావు :
భారతదేశంలో భక్తి భావం ఎంత ఎక్కువగా ఉంటుందో.. అంతకంటే ఎక్కువగా అవినీతి బంధుప్రీతి భారతీయుల్లో పాతుకుపోయింది. ప్రపంచంలోనే అవినీతిమయమైన దేశాల్లో భారత్ ఒకటిగా ఉందన్న వాస్తవాలు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024 ప్రపంచ అవినీతి సూచీలో మనదేశం 96వ స్థానంలో ఉండడం గమనించదగ్గ విషయం. భారతదేశం ఆధ్యాత్మిక చింతనతో, మత క్రతువుల్లో దాదాపు చాలా మంది తలమునకలై ఉంటారు. తరచూ రకరకాల ఆధ్యాత్మిక పండుగలు, పర్వదినాలు, పూజ లు, దైవ దర్శనాలు చేస్తూ ఉంటారు.
ఇటువంటి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గోనే వారు రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉంటారనంలో అతిశయోక్తి లేదు. అయితే ముఖ్యంగా రెవెన్యూ, ఇరిగేషన్, టాక్స్, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన అధికారులు ఎక్కువగా ఉండ డం జరుగుతుంది. అయితే వీరిలోనే అత్యధికంగా అవినీతి బంధుప్రీతి పరులుగా ఉండటం గమనార్హం. ఇక పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ వ్యక్తులు సెలబ్రిటీలు గూర్చి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా, అనుకున్నంత స్థాయిలో అన్ని రంగాల్లో నేటికీ మనదేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం అవినీతి అన్న విష యం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ ఆశయాలతో ఆనాడు దేశ ప్రజలు, భూ స్వాములు, సర్వసం దేశ విముక్తి కోసం తమ తమ ఆస్తిపాస్తులు, చివరికి ప్రాణాలను సైతం అర్పించారో ఈనాటి ప్రజానీకం కనీసం గ్రహిస్తే దేశాభివృద్ధికి తోర్పడినట్లే. అవినీతి అనే భక్తిమాటున నైతిక విలువలు, మానవతా విలువలు దిగజారిపోతున్నాయి. ఉద్యోగాన్ని, పదవుల ను అడ్డుపెట్టుకుని అడ్డదారిలో అవినీతికి పాల్పడి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వైనం పెరిగిపోతుంది.
భవిష్యత్తు ప్రశ్నార్థకం..
ఈ సంవత్సరం కాలంలో ఉదాహరణకు తెలంగాణ రాష్ర్టంలో ఇరిగేషన్ అధి కారులపై అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము బయటపడిందో కళ్లారా చూశాం. ఇలాంటి దొరకని అవినీతి తిమింగళాలు దేశంలో చాలానే ఉన్నాయి. కేవలం ఒక ఉద్యోగి, ఒక అధికారి వద్ద వందల కోట్ల రూపాయలు ఉంటే, ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది వద్ద అక్రమ సంపాదన ఉం టుందనేది ఊహించుకుంటే ఆందోళన కలుగుతుంది.
కొందరి వద్దే ఇంత పెద్ద మొత్తంలో స్థిరాస్తులు పోగుపడుతుంటే దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ కలలు గన్న ‘వికసిత్ భారత్’ ఎలా సాధ్యమవుతుంది. పదేళ్ళక్రి తం వరకూ పార్లమెంటులో కుంభకోణాలమీద చర్చలు జరిగేవి. చర్యలు తీసుకో వాలని సభలు పట్టుబట్టిన సందర్బాలు ఎక్కువే ఉన్నాయి. అయితే ఇప్పుడు పాలకులు ఉద్దేశపూర్వకంగానే చర్చకు వీల్లేకుం డా చేస్తున్నారు.
అధికారపక్షం అవినీతినీ, ఆశ్రితపెట్టుబడిదారుల అక్రమాలను ప్ర స్తావించినవారిని సభ నుంచి బహిష్కరించేవరకూ, శిక్షించేవరకూ వదలడం లేదు. అంతర్జాతీయ పత్రికలు, సంస్థలు వెలికి తీస్తున్న కుంభకోణాలను విదేశీకుట్రగా, వాటిమీద దర్యాప్తు కోరిన వారిని కుట్రదారులుగా ముద్రవేసి నోరు మూయిస్తున్నా రు. ఐదేళ్ళవరకూ లోక్‌పాల్ ఏర్పాటు చేయకుండా, తరువాత పలు సవరణలతో చివరకు దానికి కోరలు లేకుండా చేశారు.
అవినీతిని బహిర్గతం చేయడంలో ప్రధానాస్త్రంగా ప్రజలకు ఉపకరించే సమాచార హక్కు విషయంలోనూ ఇదే జరిగింది. అవినీతి నిర్మూలనకు వీలుగా సమస్త వ్యవస్థలనూ సిద్ధం చేయడానికి బదులు, ఫి ర్యాదు చేస్తే ప్రాణం మీదకు వస్తుందని ప్రజలు భయపడే వాతావరణాన్ని నెలకొల్పినంత కాలం దేశంలో అవినీతి అడ్డుకట్ట పడదన్న విషయం గ్రహించాలి.
కఠిన చట్టాలు అవసరం..
ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న చట్టాలను కఠినతరం చేయాలి. పారదర్శకంగా పరిపా లన అందించాలి. అవినీతికి పాల్పడుతున్న వారిపై నమోదు అవుతున్న కేసులుపై యుద్ధ ప్రాతిపదికన విచారణ జరిపి శిక్షలు అమలు చేసే విధంగా చట్టాలు రూపొందించాలి. అవినీతి సొమ్మును దేశాభివృ ద్ధికి ఉపయోగించాలి. సాక్షాత్తూ న్యాయమూర్తుల ఇండ్లలో బయటపడుతున్న అక్ర మాలపై కూడా సరైన చర్యలు లేకపోవడం శోచనీయం.
అవినీతి సొమ్ముతోనే ఎక్కువ మంది దేవాలయాలు, ఆశ్రమాలు నిర్మి స్తూ ప్రజల మనోభావాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తు న్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి నూ తన ఒరవడికి శ్రీకారం చుట్టారు. మరికొందరు తాము సంపాదించిన అవినీతి సొ మ్మును అన్నదానాలు, కొన్ని రకాల పథకాలు, విరాళాల పేరిట ఖర్చు చేస్తూ అవినీతి పేరుకు దూరమయ్యే ప్రయత్నా లు కొనసాగిస్తున్నారు. మామూలుగా చూసుకుంటే మనిషికి బతకడానికి కొంతమేర డబ్బు అవసరమే కానీ వందల కోట్ల రూపాయలు అవసరం లేదు.
పూర్వీకులు తమ తమ సామభేద దండోపాయాలతో ఈ ప్రక్రృతి వనరులైన భూమిని ఆక్రమించి నేటికి వేల ఎకరాలు తమ తమ ఆధీనంలో ఉంచుకుని భూస్వాములుగా, ధనికులుగా చెలామణి అవుతున్నారు. మరి నేటి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఏ మేరకు సమంజసం అనేది ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు సమ సమాజ స్థాపనకు, సమన్యాయం కోసం చట్టాలను సవరించాలి. రాజ్యాంగ ఆశయాల సాధనకు పాటుపడాలి.
అప్పుడే ‘వికసిత్ భారత్’..
అక్రమ వలసదారుల ఏరివేతకు ‘సర్’ను కేంద్ర ఎన్నికల సంఘం ఎంత పక డ్బందీగా అమలు చేస్తుందనేది, అదే వి ధంగా ‘ఆపరేషన్ కగార్’ పేరుతో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలైట్లు ఉండకూడదన్న కేంద్ర తమ ప్రతిజ్ఞను ఎంత నిష్టగా నెరవేర్చుకుంటుందనేది గమనిస్తున్నాం. అదే విధంగా దేశంలో అవినీతి, బంధుప్రీతి కోసం అక్రమ సంపాదనకు మరిగిన వ్యక్తులు టార్గెట్‌గా ‘అవినీతిరహిత ఆపరేషన్’ చేపట్టాల్సిన అవసర ముంది.
ముఖ్యంగా పన్ను ఎగవేత దారులను, అక్రమాలను, అఘాయిత్యాలకు పాల్పడే వారిని దేశద్రోహులుగా భావించి, కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో బ్యాం కులకు వందల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోతున్న నీరవ్ మోదీ, మెహల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మా ల్యా లాంటి వ్యక్తులను తిరిగి రప్పించి వా రి నుంచి అవినీతి సొమ్మును బయటకు తీయించాలి. పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు, రైట్ ఆఫ్ తగ్గిం చాలి. అప్పుడే దేశ ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తారు. అవినీతిని రూపుమాపకుంటే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరదు.
కాగితాలకే పరిమితం..
నేటికీ దేశ సంపద కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే కొందరు బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వర్గాల వద్దే కేంద్రీకృతం కావడం చూస్తేనే ఉన్నాం. ప్రభుత్వాలు చె బుతున్న పేదరికం నిర్మూలన అనేది కేవ లం అంకెల గారడీకే పరిమితమవుతుందని ఇటీవల కాలంలో ప్రపంచ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో, 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందు కోసం విద్యా, వైద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. వ్యవసాయ, పా రిశ్రామిక రంగాలను అభివృద్ధి చేసుకోవా లి. నిరుద్యోగం రేటును తగ్గించాలి. ప్రభు త్వ రంగం బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వీటన్నికంటే ముందు దేశంలో ఉన్న సంపద వికేంద్రీకరణ జరిగాలి. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా
‘టన్నులు కొద్ది ఉపన్యాసం కంటే- ఔన్స్ ఆచరణ మేలు’ అన్నది నిజం. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనేది నిజం కావాలం టే, అవినీతిపై నేటి ప్రభుత్వాలు అంకిత భావంతో ముందుకు సాగాలి.
వ్యాసకర్త సెల్: 6305682733






