19 March, 2026 | 8:48 AM

తోడేద్దాం అమ్మేద్దాం.. అంటున్న ఇసుకాసురులు

19-03-2026 12:55 AM

రేవల్లి మార్చి 18: అక్రమ ఇసుక దందా నిర్వహించే వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన గాని కుక్క తోక వంకర అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇసుక వ్యాపారస్తులు. బండ రావిపకుల గ్రామానికి చెందిన పూర్ణ కంటి రాములు S% పెద్ద ఎల్లయ్య రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా కు తెర తీశాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్న చందంగా తన ట్రాక్టర్లు లోఇసుక తీసుకెళ్తుండగా రేవల్లి పోలీసు కంటపడ్డాడు. ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.