23 June, 2026 | 10:25 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం

25-11-2025 12:00 AM

నిర్మల్ నవంబర్ 24 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా డిసిసి అధ్యక్షునిగా పార్టీ అధిష్టానం తనను ఎంపిక చేయడం సంతోషం గా ఉందని నిర్మల్ జిల్లాలో అందర్నీ కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఖానాపూర్ ఎమ్మె ల్యే డిసిసి అధ్యక్షులు వేడుమ బొజ్జు పటేల్ అన్నారు.

సోమవారం నిర్మల్ వచ్చిన సందర్భంగా స్థానిక విశ్రాంతిభవనంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమారెడ్డి ధర్మాజీ రాజేందర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ అలీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబరి రాజేశ్వర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ పిఎసిఎస్ అధ్యక్షులు రమణారెడ్డి పార్టీ నాయకులు కార్యక ర్తలు ఆయనను సన్మానం చేశారు.

ఈ సందర్భంగా కొత్త డిసిసి అధ్యక్షుని పలువురు నాయకులు సన్మానం చేసి పూల బొకేలు అందించారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు