calender_icon.png 24 November, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో చీరల పంపిణీ

24-11-2025 10:32:26 PM

అశ్వాపురం (విజయక్రాంతి): మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో సోమవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల అధ్యక్షురాలు కుంజ సునీత, గ్రామపంచాయతీ కార్యదర్శి జ్యోతి రెడ్డి, డ్వాక్రా వి.వోలు నందిపాటి పద్మ, తూము సుమలత, భవాని, కవిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము పెద్ద రాఘవులు, ఆవుల రవి, బచ్చు వెంకటరమణ, మచ్చ నరసింహారావు, చెంచల రాము, కుమ్మరి బిక్షపతి, బేతం బాబు, రాగం మల్లయ్య, కుంజ భాస్కర్, సామకూరి వెంకన్న, నాగేశ్వరరావు, మానాది వెంకన్న, బారాజు సంపత్, బొమ్మరాతి రామయ్య, గుర్రం చెన్నయ్య, పిట్ట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.