calender_icon.png 2 August, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణకు సమిష్టిగా కృషి చేద్దాం

01-08-2025 01:02:15 AM

బ్యాంకులు, ఏటీఎం వద్ద భద్రత అంశాలపై ఎస్పీ అఖిల్ సమీక్ష 

ఆదిలాబాద్, జూలై ౩౧ (విజయక్రాంతి): ప్రజలు ఎంతగానో నమ్మకంతో బ్యాంకుల లో తమ నగదు, బంగారు ఆభరణాలు సురక్షితం గా ఉంటాయని భద్రపరచడానికి ముందుకు వస్తారని వారి నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా పోలీసులు, బ్యాంక్ అధికారు లు కలిసికట్టుగా పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేద్దామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజల ఆర్థిక రక్షణకై జిల్లా పోలీసులు, బ్యాంకు అధికారులు సమన్వయం కోసం పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జిల్లా ఎస్పీ అధ్యక్షతన పోలీసులు, బ్యాంక్ అధికారుల సంయుక్త సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ముఖ్యంగా బ్యాంకు లాకర్ల లలో, ఏటీఎంల లలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సెన్సార్‌లను సీసీటీవీ కెమెరాలను అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ అలారం వ్యవస్థ బ్యాంక్ అధికారులకు దగ్గర్లో ఉన్న పోలీసు అధికారులకు వచ్చే విధంగా చూడాలన్నారు. నెలకు ఒకసారి ఏటీఎం వద్ద బ్యాంకుల వద్ద భద్రతా చర్యలు విషయంపై సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.

రాత్రి సమయాలలో ప్రత్యేకంగా బ్యాంకుల వద్ద, ఏటీఎం ల వద్ద గస్తీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవడం మంచిదని సూచించారు. దొంగలు నవీన పద్ధతులను ఉపయోగించడం తో మరింత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు.

అదేవిధంగా ప్రస్తుత సమాజంలో సైబర్ క్రైమ్ పెరిగిపోయిన కారణంగా మోసాలకు పాల్పడుతున్న వారి అకౌంట్లను ఫ్రీజ్ చేసే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఒక సైబర్ క్రైమ్ బృందాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ  సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్ రావు, ఫణిదర్, బ్యాంకు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.