9 July, 2026 | 6:34 AM

దశాబ్ద గరిష్ఠానికి ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం

12-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 11: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.12,384 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని వసూలు చేసినట్టు ప్రభుత్వ రంగ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) తెలిపింది. గత దశాబ్దకాలంగా (2014 నుంచి) ఏ నెలలోనూ లేనంత గరిష్ఠ ప్రీమియం ఆదాయాన్ని ఈ ఏప్రిల్‌లో సంపాదించినట్టు వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో సంస్థ ఆర్జించిన రూ.5,810 కోట్ల ప్రీమియం ఆదాయంకంటే 2024 ఏప్రిల్ ఆదాయం 113 శాతం అధికం. వినూత్న మార్కెటింగ్ వ్యూహాల్ని అవలంబించడం, సంస్థపట్ల పాలసీదారులకు ఉన్న విశ్వాసం, తాము అంది స్తున్న కస్టమర్ సర్వీసులు ఆదాయం పెరుగుదలకు కారణాలని ఎల్‌ఐసీ ప్రకటన తెలి పింది. ఈ ఏప్రిల్‌లో వ్యక్తిగత విభాగంలో ప్రీమియం వసూళ్లు 25 శాతం వృద్ధిచెంది రూ. 3,174 కోట్లకు పెరిగింది. గ్రూప్ పాలసీల ప్రీమియం ఆదాయం 182 శాతం వృద్ధితో రూ.9,141 కోట్లకు చేరింది.