calender_icon.png 28 January, 2026 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో లైన్ యోగి సూర్యనారాయణకు ఘన సన్మానం

28-01-2026 07:10:14 PM

భద్రాచలం,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సంస్థల నాయకులు, గ్రీన్ భద్రాద్రి ట్రస్ట్ చైర్మన్ యేగి సూర్యనారాయణకు అమెరికాలోని టెక్సాస్  యూనివర్సిటీ  డే స్ప్రింగ్  డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అఫ్ భద్రాచలం, లైన్స్ క్లబ్ ఆఫ్ శ్రీరామ, గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో బుధవారం జీయర్ మఠంలో ఘనంగా సన్మానించారు. దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రజలకు యేగి సూర్యనారాయణ ఎన్నో విశేష సేవలు అందిస్తున్నారని, వారికి డాక్టరేట్ రావడం భద్రాచలం పట్టణానికి గర్వకారణం అని సన్మాన సభలో పాల్గొన్న పలువురు వక్తలు కొనియాడుతూ అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పి. కమలా రాజశేఖర్, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత,  శ్రీరామా క్లబ్ అధ్యక్షులు చల్లగుళ్ళ నాగేశ్వరరావు, లైన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ కురిచేటి శ్రీనివాస్, ప్రముఖ సేవకులు గాదె మాధవరెడ్డి, డాక్టర్ గోళ్ళ భూపతి రావు, పల్లింటి దేశప్ప, పరిమి సోమశేఖర్, జీయర్ మఠం అధ్యక్షులు జి. వెంకటాచారి తో పాటు పలువురు లైన్స్ క్లబ్ సభ్యులు గ్రీన్ భద్రాద్రి సభ్యులు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.