28-01-2026 07:13:09 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఆత్మకూరు గ్రామ మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ తండ్రి రాములు ఇటీవల మృతి చెందారు. బుధవారం ఆయన దశదిశ కర్మ వేడుకలు చిన్న ఆత్మకూరు గ్రామంలో నిర్వహించడంతో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ ఎంపీటీసీ మోతే శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధర్యంతో ఉండాలని ధైర్యం నింపారు. బాధిత కుటుంబాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుర్రాల సిద్దయ్య, మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి, సీనియర్ నాయకులు రాజిరెడ్డి, సాయిబాబా,పడమటి దుర్గేష్, పీకే రాజు, తదితరులు పాల్గొన్నారు.