13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక

23-03-2026 03:34 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం జరిగింది. అధ్యక్షుడిగా లింగాల భూపాల్ (నమస్తే తెలంగాణ), ఉపాద్యకులుగా కుంటోళ్ల యాదగిరి (మన తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా కొండా శ్రీనివాస్ రెడ్డి (సాక్షి), సంయుక్త కార్యదర్శిగా సల్లూరి నర్సింగ్ రావు (ప్రజాపక్షం), కోశాధికారిగా లంబ రాజుయాదవ్ (సూర్య) లు ఎన్నిక కాగా సలహాదారులుగా మేడబోయిన నర్సింహ్మా (వార్త), ఫొతేధార్ రామకృష్ణ (ఈనాడు), మేకల పద్మారావు (విశాలాంధ్ర)లను నియమించారు. ఎన్నిక అథారిటీగా వేముల గోవింద్ రాజ్, కె. శ్రీనివాస్ రెడ్డి లు వ్యవహరించారు. ఈసందర్భంగా నూతన కార్యవర్గాన్ని శాలువాలతో సన్మానించారు.