18 April, 2026 | 7:57 PM

త్రుటిలో తప్పిన విద్యుత్ ప్రమాదం

12-06-2025 06:42 PM

భారీ వాహనాలతో ప్రమాదాలు..

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ కేంద్రంలో విద్యుత్ ప్రమాదం తృటిలో తప్పింది. గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధిలో భారీ వాహనల రాకపోకలు సాగిస్తుండగా రోడ్డుపైన అడ్డుగా ఉన్న వైర్లు లారీకి తగిలి విద్యుత్ వైర్లు అడ్డంగా తెగిపోయి నిప్పులు చెలరేగాయి. ఏ ఎం కె ఫంక్షన్ హాల్ రోడ్డులో గల ఈ రోడ్డు ఇరుకుగా ఉండడంతో పెద్ద వాహనాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఉండగా గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో షాపులు నిర్వహిస్తున్న యజమానులు ఒక్కసారిగా గగ్గోలు పెడుతూ వీధిలోకి పరిగెత్తారు. విద్యుత్ కార్యాలయానికి స్థానికులు ఫోన్ చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.