calender_icon.png 23 May, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రికి కూతురు లేఖ రాయడమేంటి..?

23-05-2025 01:34:43 PM

కాంగ్రెస్ కుట్రనే...కవిత లేఖనేమో..!

-ఎమ్మెల్సీ కవితపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

మహబూబ్​నగర్,(విజయక్రాంతి): తండ్రికి కూతురు లేఖ రాయవలసిన అవసరం ఏమొచ్చిందో ఎమ్మెల్సీ కవిత చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(Mahabubnagar MP DK Aruna) ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎంపీ డీకే అరుణ పలు ప్రశ్నలను సంధించారు. ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, మాజీ సీఎం కెసిఆర్ కు రాసిన లేఖ పై సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. తండ్రికి కూతురు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని పేర్కొన్నారు. 

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ని కలిసే పరిస్థితి కూడా కవిత కు లేదా పని ప్రశ్నించారు. అన్న కేటీఆర్ తో ఉన్న రాజకీయ వైరంలో ఇది భాగమేనా..? అన్నారు.  అసలీ లేఖ కవిత రాసిందేనా..? రాస్తే ఎలా బయటకు వచ్చింది..? ఎవరు రిలీజ్ చేసారు..? చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.  ఇది పొలిటికల్ ఎత్తుగడ కావచ్చు అన్నారు. ఈ లేఖ వెనుక కాంగ్రెస్ పొలిటికల్ గేమ్ ఏమైనా ఉందా..? పలు సందేహాలు ఉన్నాయని చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ నే కవిత పేరుతో లేఖ రిలీజ్ చేసిందా..? చెప్పాలన్నారు. బీజేపీ ని టార్గెర్ చేస్తే లబ్ది పొందాలని చూస్తున్నారా..? అని ప్రశ్నించారు. 

- తెలంగాణలో  ప్రత్యమ్నయం బీజేపీ నే..

ఈసారి ఏ ఎన్నికలు వచ్చిన తెలంగాణాలో బీజేపీ గెలిపించాలనే ఉద్దేశం ప్రజల్లో మొదలైందన్నారు. ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని ఎవ్వరు తగ్గించలేరు. ఎన్నటికీ బీజేపీకి టిఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదన్నారు.  కవిత లేఖ ఆఫీసియల్ ఆ కాదో తెలియదనీ, ఆ క్లారిటీ ఇస్తే స్పందిస్తన్నారు. బీజేపీ ని టార్గెట్ చేస్తే మీకోచ్చేది ఏమి లేదన్నారు. తెలంగాణ ప్రజల్లో బిజెపిని కోరుతున్నారని, ఎన్ని చిత్ర విచిత్ర వేషాలు వేసిన రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని భీమా వ్యక్తం చేశారు.