లిప్‌స్టిక్.. మేకప్
కస్టడీలో హీరోయిన్ పవిత్ర గౌడ దర్జా ఇది
పోలీసుల తీరును తప్పుబడుతున్న నెటిజన్లు
బెంగళూరు జూన్ 27: శాండల్‌వుడ్ స్టార్ హీరో దర్శన్ ఫ్యాన్ రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ పవిత్ర గౌడకు ఏ మాత్రం పశ్చాతాపం లేనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేష్టలు నెటిజన్లతో పాటు సామాన్య జనాలకు కూడా కోపం తెప్పిస్తున్నాయి. పవిత్ర గౌడ ఇలా చేస్తున్నా పెద్దగా పట్టించుకోని పోలీసులను కూడా అం తా విమర్శిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందం టే.. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైల్లో ఉన్న హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు విచారణ నిమిత్తం జూన్ 15వ తేదీన ఆమె ఇంటికి తీసుకెళ్లారు. లోపలికి మామూలుగా వెళ్లిన పవిత్ర లోపలి నుంచి మాత్రం మేకప్, లిప్‌స్టిక్ తో వచ్చింది. అంతే కాకుండా కెమెరాలను చూసి చిరునవ్వులు చిందిస్తూ పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అమ్మడు మీద అంతా విరుచుకుపడుతున్నారు. పోలీసుల తీరును కూడా తప్పుబడుతున్నారు.






