calender_icon.png 19 January, 2026 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు సకాలంలో టీకాలు వేయించాలి

19-01-2026 07:44:12 PM

– జిల్లా పశు వైద్యాధికారి డా. వెంకటయ్య

కొల్చారం,(విజయక్రాంతి): పశువుల్లో సీజనల్ వ్యాధులు రాకుండా సకాలంలో నివారణ టీకాలు వేయించుకోవాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్సలు చేయించుకొని, ఎద లక్షణాలను సకాలంలో గుర్తించి గోపాలమిత్ర ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించుకోవాలని సూచించారు.

కృత్రిమ గర్భధారణ ద్వారా మేలు జాతి దూడలు జన్మిస్తాయని తెలిపారు. శిబిరంలో రంగంపేట పశువైద్య అధికారి డాక్టర్ ప్రియాంక పశువులను పరిశీలించి మందులు అందించగా, లేగ దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆరె రవీందర్,మెదక్ జిల్లా గోపాలమిత్ర సూపర్‌వైజర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, గోపాలమిత్రులు మానయ్య, శ్రీకాంత్, ప్రవీణ్, విజయ్ కుమార్, సిబ్బంది నరేష్,గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.