calender_icon.png 8 February, 2026 | 1:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణ మంజూరు పత్రాలు అందజేత

08-02-2026 01:52:28 AM

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప రీజియన్ చిలకలూరిపేట బ్రాంచ్‌లో ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ ఔట్‌రీచ్ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కడప రీజనల్ హెడ్ ఈ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. భారీ సంఖ్యలో కస్టమర్లు ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చిలక లూరిపేట బ్రాంచ్ హెడ్ కె మురళీ మోహన్, ఇతర సిబ్బంది ఉన్నారు. రుణగ్రహీతలకు రుణ మంజూరు పత్రాలు అందజేశారు. మండలానికి ఈ ప్రచారంలో రూ.30 కోట్లు, రూ.25 కోట్లు కడప రీజియన్ పరిధిలోని అన్ని ఇతర శాఖలు కూడా తమ తమ స్థలాల్లో ప్రచారాన్ని నిర్వహించాయి.