calender_icon.png 8 February, 2026 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో సేజ్ బ్రుక్ స్కూల్

08-02-2026 01:51:35 AM

నూతన క్యాంపస్ ప్రారంభం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సేజ్‌బ్రుక్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు వెస్ట్ హైదరాబాద్‌లో తన నూతన క్యాంపస్‌ను ప్రారంభించారు. యూకేకు చెందిన విట్‌గిఫ్ట్ స్కూల్ సీనియర్ నాయకత్వ సమక్షంలో నిర్వహిచారు. విట్‌గిఫ్ట్ స్కూ ల్ ప్రతినిధులుగా హెడ్మాస్టర్ మిస్టర్ టోబీ సెత్, డైరెక్టర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మిస్టర్ జాన్ చిషోలం, సేజ్‌బ్రుక్ ఇంటర్నేషనల్ స్కూల్ హెడ్ ఆఫ్ స్కూల్ మిస్ జోయ్ ఎల్. హౌసర్ పాల్గొన్నారు.

ఈ భాగస్వా మ్యం ద్వారా పాఠ్యక్రమ సహ-రూపకల్పన, అధ్యాపకుల అభివృద్ధి, అంతర్జాతీయ విద్యా మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. విట్‌గిఫ్ట్ స్కూల్ హెడ్మాస్టర్ టోబీ సెత్ మా ట్లాడుతూ.. ‘ఈ క్యాంపస్ స్పష్టమైన లక్ష్యం తో కూడిన విద్యను ప్రతిబింబిస్తోంది. విలువల ఆధారిత విద్యపై సేజ్బ్రుక్ చూపుతున్న నిబద్ధత ఈ భాగస్వామ్యాన్ని మరింత అర్థవంతంగా మారుస్తోంది’ అన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న సేజ్‌బ్రుక్ క్యాంపస్‌లో సస్టైనబిలిటీ, విద్యార్థుల శ్రేయస్సు, భవిష్యత్ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

సేజ్‌బ్రుక్ ఇంటర్నేషనల్ ఫౌండింగ్ పార్ట్‌నర్, సుచిత్ర అకాడమీ వ్యవస్థాపకులు మిస్టర్ ప్రవీణ్ రాజు మాట్లాడుతూ.. ‘సేజ్‌బ్రుక్ అనేది దృ ష్టి, భాగస్వామ్యం, ఉద్దేశం కలిసిన ఆలోచన. గ్లోబల్ స్థాయి విద్యను హైదరాబాద్‌కు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు, సం రక్షణ, సమాజంతో అనుబంధం ఉన్న విద్యాసంస్థగా దీన్ని రూపొందించాం. విట్‌గిఫ్ట్ స్కూల్త్ భాగస్వామ్యం ద్వారా ఇది ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా ఎదుగుతుంది’ అని తెలిపారు.