03-07-2025 01:15:28 AM
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు చేనేత కార్మికులకు లక్ష వరకు రుణ మాఫీ కోసం రూ. 33 కోట్లకు పరిపాలన అ నుమతులు జారీ చేసినట్టు చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. దీంతో 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేది నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకొన్న రూ. లక్ష వరకు రుణాల(అసలు, వడ్డీ కలిపి)కే మాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
మా ర్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాలలో రుణమాఫీని నగదును జమ చేస్తామని వెల్లడించారు. రుణ మాఫీ జరిగిన అనంతరం చేనేత కార్మికులు కోరు కుంటే బ్యాంకర్లు మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని తెలియజేశారు.