calender_icon.png 3 July, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగాచిలో పేలింది రియాక్టర్ కాదు!

03-07-2025 01:19:51 AM

  1. లేఖలో స్పష్టం చేసిన కంపెనీ యాజమాన్యం
  2. భారీ విస్పోటనానికి కారణమేంటి?
  3. పేలుడుపై తొలగని అనుమానాలు!

సంగారెడ్డి, జూన్ 2 (విజయక్రాంతి): పాశమైలారం సిగాచి కంపెనీలో పేలింది రియాక్టర్ కాదని కంపెనీ యాజమాన్యం పేర్కొంది. బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యాలయానికి పంపి న లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. ఈ ప్రమాదంలో 40 మంది మృ తి చెందినట్లు, 33 మంది గాయపడిన ట్లు స్పష్టం చేసింది.

ప్రమాదానికి కా రణమేమిటనేది దర్యాప్తు సంస్థలు వి చారణ అనంతరం తమ నివేదికను వె ల్లడిస్తామని పేర్కొంది. అయితే ఇంతటి విస్పోటనానికి గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పేలింది స్ప్రే డ్రయ్యర్ బ్లాక్?

సిగాచి కంపెనీలో పేలింది రియాక్ట ర్ కాదనేది కంపెనీ యాజమాన్యం ప్రకటిస్తున్న నేపథ్యంలో అక్కడ పేలింది స్ప్రే డ్రయ్యర్ బ్లాక్ అని పలువురు కార్మికులు చెపుతున్నారు. మెడిసిన్ తయారీలో ప్రధానంగా ఉపయోగించే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను ఇక్కడ ఉ త్పత్తి చేస్తున్నారు. ఈ పదార్థాలు ఇంత టి విస్పోటాన్ని కలిగించవని పలువురు అనుభవం ఉన్న కార్మికులు చెపుతున్నారు.

భారీ విస్పోటనంతో పాటు ఉవ్వెత్తున జ్వాలలు ఎగిసిపడటం, పే లు డు ధాటికి మూడంతస్థుల భవనం కు ప్పకూలిపోవడం వెనుక మరేదైనా కా రణం ఉందా అనే కోణంలో దర్యా ప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏదై నా బలమైన పేలుడు పదార్థం కారణంతో నే ఈ ఘటన జరిగి ఉంటుందని, పూర్తిస్థాయి దర్యాప్తులోనే అసలు విషయా లు బయటకు వస్తాయని భావిస్తున్నారు.

అధిక ఒత్తిడితోనే..

సిగాచి కంపెనీలో పేలుడు జరిగింది ఎయిర్ స్ప్రే డ్రయ్యర్ బ్లాక్‌లో అని ప్ర చారం సాగింది. కానీ ఇందుకు సంబంధించి కంపెనీ యాజమాన్యంగానీ, అ ధికారులుగానీ స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. ఈ కంపెనీలో మెడిసిన్‌కు సంబంధించి మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను ఉత్పత్తి చేస్తున్నారని, ఇందుకు సుమారు 800 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రత వద్ద బాయిల్ అవుతుందని తెలు స్తున్నది.

ఈ నేపథ్యంలో డ్రయ్యర్‌లో సాంకేతిక లోపం వల్ల బ్లాక్ అవడంతో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా పేలుడు సం భవించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఆయిల్ మరగడం వల్ల మంటలు ఉధృతమైనట్లు పలువురు కార్మికులు చెపుతున్నారు. అంతేగాకుండా కూలిన భవనం పైఅంతస్తులో డ్రమ్ముల్లో గుర్తు తెలియని కెమికల్ స్టోర్ చేశారని, మంటలు చెలరేగడంతో కెమికల్ కూడా అంటుకొని తీవ్రస్థాయిలో బ్లాస్టింగ్ జరిగి ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. 

కంపెనీలో పాతబడిన మిషనరీ!

కంపెనీ ఉద్యోగి యశ్వంత్ భానూర్ పోలీసులకు ఇచ్చిన ఫి ర్యాదులో పలు విషయాలు వెల్లడయ్యాయి. కంపెనీలో పాతడిన మిషనరీ ఉందని, దీనిపై కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే చా లాసార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కంపెనీ యాజమాన్యం పట్టించుకోకుం డా పాతబడిన మిషనరీ వాడటంతో ప్రమాదం జరిగిందని ఫి ర్యాదు చేశారు.

ఫ్యాక్టరీలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించలేదని పోలీసులు పేర్కొన్నారు. అ గ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరేందుకు సరైన మా ర్గాలు లేకపోవడం సహాయ చర్యలకు ఆటంకం కలిగించిందని తెలిపారు. ఈ విషయంలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ అధికారులు, సంబంధిత అధికారులను కదిలించగా పూర్తి స్థాయి దర్యా ప్తు తర్వాతనే అసలు విషయాలు తెలుస్తాయని దాటవేస్తున్నారు.