calender_icon.png 17 August, 2025 | 11:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లింగాపూర్ గ్రామపంచాయతీకి తాళం!

03-03-2025 03:04:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల లో అభివృద్ధి కార్యక్రమాల ను పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పంచాయతీ కార్యదర్శులు వారి బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఇందుకు బెల్లంపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ(Lingapur Grama panchayat) కార్యదర్శి పనితీరే నిదర్శనంగా కనిపిస్తుంది. గ్రామపంచాయతీలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి కనిపించింది. మండల పంచాయతీ అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు తమ ఇష్టారీతిన విధులు చేపడుతున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పంచాయతీ కార్యదర్శులు గ్రామపంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.