calender_icon.png 17 August, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా

17-08-2025 09:10:42 AM

ఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) కొద్దిసేపటి క్రితం భారతదేశానికి చేరుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్(Union Minister Jitendra Singh), ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో చైర్మన్ వి. నారాయణన్, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈ సందర్భంగా శుభాంశు శుక్లా విజయ చిహ్నాన్ని చూపిస్తూ అందరినీ పలకరించారు. తన అనుభవాలను స్నేహితులు, సహోద్యోగులతో పంచుకోవడానికి తాను ఆసక్తిగా ఉన్నానని శుభాంషు శుక్లా నిన్న 'ఎక్స్' వేదిక వద్ద వెల్లడించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ఆక్సియం-4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతం అయిన తర్వాత ఆయన భారతదేశానికి రావడం ఇదే మొదటిసారి. శుభాంశు శుక్లా నేడు ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు.