calender_icon.png 24 January, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దితో ప్రత్యేకంగా..

24-01-2026 01:18:16 AM

రామ్‌చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా ‘పెద్ది’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ చూడని మాస్‌లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని స్పెషల్ మాస్ సాంగ్‌లో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోందనేది ఆ వార్తల సారాంశం. రామ్‌చరణ్ లాంటి గ్రేట్ డ్యాన్సర్‌తో మృణాల్ స్టెప్పులు వేయబోతోందనే ఈ వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ స్పెషల్ అట్రాక్షన్ సినిమాకు అదనపు బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారట మేకర్స్. ఈ ప్రత్యేక గీతం విషయమై ఇప్పటికే మేకర్స్ మృణాలతో చర్చలు పూర్తి చేసి, ఆమెనే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్. మార్చి 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్ విషయమై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అనేది టీమ్ అధికారిక ప్రకటన వెలువడే వరకూ ఆగాల్సిందే.

ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. బాలీవుడ్‌లో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా రూపొందుతున్న ‘దో దివానే షెహర్ మే’ సినిమాలో రోషిని పాత్రలో నటిస్తోంది మృణాల్. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా ఈ ముద్దుగుమ్మ నటించిన  ‘డెకాయిట్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అడివి శేష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మార్చి 19న థియేటర్లలో అడుగుపెట్టనుంది.