18 May, 2026 | 5:11 PM

సుప్రీం’ కేసులపై లోక్ అదాలత్

20-06-2024 12:48 AM

తొలిసారి ప్రత్యేకంగా ఏర్పాటు

హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): జూలై 29 నుంచి ఆగస్టు 3 వరకు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై తొలిసారి ప్రత్యేక లోక్ అదాలత్ జరగనుంది. బుధవారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మధ్యవర్తిత్వానికి అనుకూలంగా 295 కేసులు ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అథారిటీ నుంచి వర్చువల్‌గా కక్షిదారులతో మధ్యవర్తిత్వంపై మాట్లాడుతున్నామని, ఇప్పటివరకు 3 కేసుల్లో సంసిద్ధత వ్యక్తం చేశారని వివరించారు. ఎవరైనా వివరాల కోసం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య 040 నెంబర్‌ను సంప్రదించవచ్చునని చెప్పారు.