‘స్టార్’లో ట్రామా అండ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్‌వర్క్
- 10 కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అధునాతన అంబులెన్స్‌లు ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో అత్యవసర సంరక్షణ సేవలను మరింత మెరుగుపరిచేందుకు నానక్‌రామ్‌గూడలోని స్టార్ ఆస్పత్రిలో నూతనంగా ట్రామా అండ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా అందుబా టులోకి తీసుకొచ్చిన 10 కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అధునాతన అంబులెన్స్‌లను ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్ర మంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ గూడపాటి, ఎమర్జెన్సీ మెడిసిన్ గ్రూప్ లీడర్ డాక్టర్ రాహుల్ కట్టా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధానంలో అధునాతన అంబులెన్స్‌లు మంచి మార్పును తీసుకొస్తాయని విశ్వసిస్తున్నట్టు తెలియజేశారు. స్టార్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా స్టార్ బృందం తమ నైపుణ్యతను అంకితభావంతో చాటుకుంటున్నట్టు చెప్పా రు. ఈ నెట్ వర్క్ ద్వారా కాల్ చేసిన 15 నిమిషాల్లోనే అంబులెన్స్ చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానంలో ఉన్నట్టు తెలిపారు. నూతనంగా తీసుకొచ్చిన అంబులెన్స్ లు నార్సింగి, మణికొండ, టోలిచౌకి, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ, మియాపూర్, లింగంపల్లి, గౌలిదొడ్డి, మాదా పూర్, పటాన్‌చెరు ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయన్నారు.






