calender_icon.png 12 November, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాకాల ప్రణాళికకు సిద్ధం

19-05-2024 01:57:49 AM

జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి 

హైదరాబాద్ సిటీబ్యూరో, మే18 (విజయక్రాంతి) : వర్షాకాల ప్రణాళికకు సిద్ధంగా ఉండాలని జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఎండీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశముందని వాతావరణశాఖ తెలిపిన నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి భద్రత సామాగ్రి, రెయిన్ కోట్స్ సరిపడా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎయిర్‌టెక్ యంత్రాలు, సిల్ట్ కార్ట్ వాహనాలను అందుబాటులో ఉంచుకోవా లని కోరారు. వచ్చే వారం క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని, వర్షాలు ప్రారంభం కాకముందే అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబు, డైరెక్టర్ ఆపరేషన్స్  అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, డైరెక్టర్ ఆపరేషన్ స్వామి, సీజీఎంలు, జీఎంలు తదితరులు పాల్గొన్నారు.