22 April, 2026 | 5:46 PM

బస్సులో ఒకే ఒక్కరు

22-04-2026 04:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్సులో ప్రయాణం సాహసంతో కూడింది. బస్సు సీట్ లో కూర్చోవడం దేవుడెరుగు. మగవారు ఎక్కడానికి స్థలం కూడా దొరకడం లేదు. ఇదంతా నిన్నటి వరకు ఆర్టీసీ సమ్మె కారణంగా నిర్మల్ బైంసా రూట్లో బుధవారం నిర్మల్ డిపోకు చెందిన ఓ బస్సులో బైంసా నుండి నిర్మల్ వరకు ఒక డ్రైవర్ ఒక ప్యాసింజర్ మాత్రమే ప్రయాణించడం జరిగింది. వినటానికి వింతగా ఉన్న ఇది సమ్మె నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది