22 March, 2026 | 2:40 AM

బైక్‌ను ఢీకొట్టిన లారీ

22-03-2026 01:18 AM

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు 

మిర్యాలగూడ, మార్చి 21 (విజయక్రాంతి): బైకును లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ వద్ద శనివారం జరిగింది. సూర్యాపేట జిల్లా అన్నారం  గ్రామానికి  చెందిన శ్రీరాముల రాములు (60) మరో వ్యక్తితో కలిసి త్రిపురారంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి బైక్‌పై వస్తుండగా శ్రీనివాస్ నగర్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాములు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.