22 March, 2026 | 2:40 AM

బైక్‌ను ఢీకొట్టిన కారు

22-03-2026 01:20 AM

తండ్రి కొడుకులకు గాయాలు

గరిడేపల్లి, మార్చి 21 (విజయక్రాంతి): బైక్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో తండ్రి కొడుకులకు గాయాలైన ఘటన గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన భానోత్ నాగేశ్వరరావు, తన కుమారుడు జ్ఞానేశ్వర్‌తో కలిసి బైక్‌పై మండలంలోని రేగులగడ్డ తండ నుంచి వస్తున్నారు.

ఈ క్రమంలో కీతవారిగూడెం యూ టర్న్ వద్ద హుజూర్‌నగర్ నుంచి మిర్యాలగూడ వైపుకు వెళుతున్న కారు ఢీకొట్టింది. దీంతో తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. నాగేశ్వరరావు, జ్ఞానేశ్వరను హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరా బాద్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును వదిలేసి పరారైన వ్యక్తిని కోదాడకు చెందిన నాగులు మీరాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్సు చలిగంటి నరేష్ తెలిపారు.