10-09-2025 12:46:09 PM
కలెక్టరేట్ ఏఓ భాను ప్రకాష్
వనపర్తి,(విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని, ఆమె జీవితం అందరికి స్ఫూర్తి దాయకమని కలెక్టరేట్ ఏఓ భాను ప్రకాష్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకొని వెనకబడిన కులాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఏఓ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం అందరికి స్ఫూర్తి దాయకమన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ అన్ని వర్గాల హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ధీరవనిత అని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా ఐలమ్మ అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డివైస్ ఓ సుధీర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్దీన్ ఖాన్, రజక సంఘం జిల్లా నాయకులు బండలయ్య, ఇతరులు, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు వెంకటేష్, రాజు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.