calender_icon.png 10 September, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ....

10-09-2025 01:04:31 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి...

బాన్సువాడ, (విజయక్రాంతి): తెలంగాణ సాయుద పోరాట యోదురాలు, స్వర్గీయ చాకలి ఐలమ్మ(Chakali ilamma) అని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 45వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సబ్ కలెక్టర్ కిరణ్మయి లు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పోరాటం మరువలేనిదని సాయుధ పోరాటం చేసి తెలంగాణ సాధనలో ఎంతగానో పోరాడిందని ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు