calender_icon.png 10 September, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం పోరాడుదాం

10-09-2025 01:07:06 PM

పాలడుగు నాగార్జున కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి) భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరివిముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యెాధురాలు చాకలి ఐలమ్మ(chakali ilamma ) ఆశయ సాధన కోసం పోరాడుదామని కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి(Nalgonda District Chief Secretary) పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. బుధవారం నల్లగొండ కెవిపిఎస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా పూలమాలంకరణ చేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ  ఐలమ్మ తన పంట పొలాలను కాపాడుకోవటంకోసం విస్నూర్ దొర గూండాలకు ఎదురొడ్డి కొంగునడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగిలా తిరగబడిందని తెలిపారు. వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగల్చిన అగ్నికణం ఐలమ్మ అని ఆనాడు మట్టి మనుషులను ఒక్కటి చేసి మహయెాధులుగా తీర్చిదిద్ది బాంచన్ దొరా నీ కాల్ ముక్త అన్న పేద జనాన్ని గడప దాటని స్త్రీలను వీధుల్లో పోరాడే దశకు చేర్చిందని అన్నారు. 

పట్వారి జాగీర్దార్లకు కులాల వారీగా వృత్తులు చేయాలని నిబంధనలను సామాజిక అణచబడ్డ వారందరినీ ఏకం చేసింది తెలంగాణ సాయుధ పోరాట గట్టమని తెలిపారు. నేటికీ గ్రామాలలో భూమిలేని నిరుపేదలు దళితులు గిరిజనులు బలహీన వర్గాల పేదలకు భూమి భూమి కొరకు పోరాడుదామని పిలుపునిచ్చారు సామాజిక అణిచివేతలను ఎదిరిద్దామని తెలిపారు. ఈకార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్, నాయకులు సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, నాయకులు, కొండా వెంకన్న, నలుపరాజు,కె. సైదులు, శంకర్  శ్రీనివాస్ సైదులు తదితరులు పాల్గొన్నారు.