calender_icon.png 10 September, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూర్గంపాడు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

10-09-2025 12:43:47 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడు మండలంలో(Burgampadu Mandal) పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించారు. సారపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థినీలకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు.ఐటీసీ లిమిటెడ్ సహకారంతో పేద విద్యార్థినులకు సైకిళ్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

అనంతరం బూర్గంపాడు మండల కేంద్రంలో రూ.38లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి ఇంటింటికీ రక్షిత మంచి నీరు సరఫరా చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రసాద్,ఎంపీడీవో జమలారెడ్డి,ఎంఈఓ యదు సింహరాజు,ఎంపీవో బాలయ్య,మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,ఐటీసీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ చెంగల్ రావు,టిపిసీసీ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ భజన సతీష్,మాజీ జడ్పిటిసి విజయ్ గాంధీ,చల్లా వెంకటనారాయణ,భజన ప్రసాద్,వెంకటేశ్వర్ రెడ్డి, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.