calender_icon.png 10 September, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ కుట్రకు ప్లాన్.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

10-09-2025 01:41:36 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, జార్ఖండ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (Anti Terrorist Squad), రాంచీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు అనుమానిత ఐఎస్ఐఎస్ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు బుధవారం అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు బొకారోకు చెందిన అషర్ డానిష్‌గా గుర్తించబడ్డాడు. అతన్ని రాంచీలోని  లాడ్జిలో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. డానిష్ వద్ద ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఐసిస్‌తో సంబంధం ఉన్న మాడ్యూల్‌కు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్(Delhi Police Special Cell) నమోదు చేసిన కేసులో అతను వాంటెడ్‌గా ఉన్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ బృందాలు ఏకకాలంలో నిర్వహించిన సమన్వయంతో కూడిన ఆపరేషన్‌లో మరో అనుమానితుడు అఫ్తాబ్‌ను ఢిల్లీ నుండి అరెస్టు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిద్దరూ ఐసిస్ ప్రేరేపిత నెట్‌వర్క్‌లోని(ISIS-inspired network) ఇతర సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారని, భారతదేశంలో ఉగ్రవాద సంస్థ ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ఆపరేషన్‌లోని వర్గాలు తెలిపాయి. డానిష్ చాలా నెలలుగా భద్రతా సంస్థల రాడార్‌లో ఉన్నాడు. దేశంలో భారీ కుట్రకు యోచిస్తున్న ఉగ్రవాద మాడ్యూల్(Terrorism module)ను పోలీసులు చేధించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఉగ్రవాద మాడ్యూల్ కు సంబంధించి దేశంలో పలు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద మాడ్యూల్ తో సంబంధాలున్న 12 మందిని అరెస్ట్ చేశారు.