calender_icon.png 29 August, 2025 | 4:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి

29-08-2025 03:38:21 AM

  1. వారంలో 31 వేల టన్నులు యూరియా 
  2. సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో పంట నష్ట నివారణపై జాగ్రత్తలు తీసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. డిమాండ్ అధికంగాఉన్న జిల్లాలకు యూరియా సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. గురువారం సచివాలయంలో తన శాఖ పరిధిలోని పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఆదివారం నాటికి కేంద్రం 18 వేల యూరియా పంపిణీ చేయబోతుందని, వారంలో మరో 21 వేల యూరియా రానుందని, పది రోజుల్లో మొత్తం 39 వేల మెట్రిక్ టన్నుల యూరి యా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయనుందని మంత్రి తెలిపారు.  సెప్టెంబర్ నెలకు అధిక కేటాయింపులు చేయాలని కోరేందుకు జాయింట్ సెక్రటరీని ఢిల్లీకి పంపినట్టు మంత్రి వెల్లడించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతుల బాటపట్టేలా యాంత్రీకరణ దిశగా అడుగులు వేసే లా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.

సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ సహాయ చర్యలు సకాలంలో చేపట్టి బాధితులను కాపాడిన ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్‌ను అభినందించారు. ఆయా శాఖలతో పాటు కార్పొరేషన్ల పరిధిలో ఉద్యోగుల హాజరుపై కూడా మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తప్పవన్నారు.