calender_icon.png 2 September, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

29-08-2025 03:39:59 AM

  1. నష్టనివారణ చర్యలు సత్వరమే చేపట్టండి
  2. నీటిపారుదల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
  3. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉం డాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలన్నారు. 24 గంటలు జలాశయాలను పర్యవేక్షించడంతో పాటు కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

అత్యవసర నిధులను వినియోగించి నష్ట నివారణ చర్య లు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరదలపై సత్వరమే కంట్రోల్ రూమ్ లను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన ఇసుక బస్తాలు, ఇతరత్రా సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లాల కలెక్టర్లతో పాటు రెవెన్యూ, విద్యుత్ ఇతర విభాగాల అధికారులను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కామారెడ్డి, మెదక్ తదిత ర జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను అప్ర మత్తం చేసి ఎటువంటి విపత్తులు సంభవించకుండా చూడాలన్నారు.

నిజాంసాగర్‌కు ఇప్పటికే 1.52 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవా హం వస్తుండగా అదనంగా మరో 86 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నందున అక్కడి జలాశయ పరిస్థితి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో అవసరం ఉన్నంత మేరకు నీటిని నింపాలన్నారు.

గోదావరి బేసిన్‌లోని శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానే రు, లోయర్ మానేరు ప్రాజెక్టులపై ఈ సందర్భంగా సమీక్షించారు. అన్నపూర్ణ, రంగనా యక సాగర్, మల్లన్న సాగర్‌లలో పంపింగ్‌ను వేగవంతం చేసి పూర్తిస్థాయిలో నీటి మట్టాలు నిండేలా చూడాలన్నారు. పంపింగ్ నిర్వహణలో ఆటంకాలు ఎదురు కాకుండా విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసుకోవాలని  ఆదేశించారు.

చెక్కు చెదరని పోచారం ప్రాజెక్టు   

‘103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుని సురక్షితంగా నిలబడింది. ఈ ప్రాజెక్టు గరిష్ఠ వరద 70,000 క్యూసెక్కులు. కానీ గరిష్ట వరద కంటే ఎక్కువ వరద వచ్చినా పోచారం ప్రాజెక్టు చెక్కు చెదరలేదు’ అని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.