13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పోగొట్టుకున్న బంగారు నగలు బాధితులకు అప్పగింత

28-03-2026 01:15 AM

తూప్రాన్, మార్చి 27: పోగొట్టుకున్న బంగారు, నగలను పోలీసులు బాధితులకు అందజేశారు. బ్రాహ్మణపల్లి రైల్వే గేట్ సమీపంలో ఒక వ్యక్తి తన బ్యాగ్ను కోల్పోయినట్లు, అందులో సుమారు 9 తులాల బంగారం ఉన్నట్లు 109 ద్వారా సమాచారం అందుకున్నారు. వెంటనే తూప్రాన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాంతో ఆ బ్యాగ్ ఒక స్పీడ్ బ్రేకర్ వద్ద పడి పోయినట్లు, అక్కడి నుంచి ఒక వ్యక్తి దాన్ని తీసుకున్నట్లు గుర్తించారు.

పరిశీలించగా అందులో ఉన్న సుమారు 9 తులాల బంగారు రెండు చైన్లను స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. అనంతరం తూప్రాన్ డిఎస్పి కార్యాలయంలో బాధితులకు డిఎస్పి ఆధ్వర్యంలో అప్పగించారు. బంగారు నగలు దొరికిన వ్యక్తులను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ రెడ్డి అభినందించారు. ఇందులో సి ఐ, ఎస్‌ఐ గంగారాజు, పోలీస్ సిబ్బంది బాధితులు ఉన్నారు.