సిద్ధివినాయకుడిని దర్శించుకున్న మెదక్ అదనపు ఎస్పీ
28-03-2026 01:13 AM
జహీరాబాద్, మార్చి 27 : న్యాల్కల్ మండలంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ దర్శించుకున్నారు. శుక్రవారం ఆయన దేవాలయానికి చేరుకోగానే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదనపు ఎస్పీతో పాటు డిపిఓ సూపర్డెంట్ అల్లా నాయక్ తదితరులు ఉన్నారు.




